Game Changer: గేమ్ ఛేంజర్ సినిమాపై కేసు నమోదు
గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదొక ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉంది. రిలీజ్ కు ముందు పలు వివాదాలు ఎదుర్కొన్న ఈ మూవీ, రిలీజ్ తర్వాత డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రామ్ చరణ్(Ram Charan), కియారా అద్వానీ(Kiara Advani), అంజలి(Anjali) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ రూ.300 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు(Dil Raju) నిర్మించాడు.
గేమ్ ఛేంజర్ కు డిజాస్టర్ టాక్ రావడం వల్ల దిల్ రాజు ఈ సినిమాతో భారీగా నష్టపోవాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాలో ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులు నటించిన విషయం తెలిసిందే. ఐతే, ఈ మూవీలో నటించినందుకు గానూ తమకు ఎలాంటి పారితోషికం అందలేదని మూవీ కో డైరెక్టర్ స్వర్గం శివ(Swargam Siva)పై ఆర్టిస్ట్ తరుణ్(Tharun) గుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు.
గేమ్ ఛేంజర్ షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుంచి హైదరాబాద్కు దాదాపు 350 మంది ఆర్టిస్టులు వెళ్లగా, వారికి ఒక్కొక్కరికి రూ.1200 ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారని, కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా తమకు అందలేదని ఆర్టిస్ట్ తరుణ్ పోలీస్ స్టేషన్ లో కో డైరెక్టర్ పై కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు అయినా తమకు న్యాయం చేయాలని జూనియర్ ఆర్టిస్టులు డిమాండ్ చేస్తున్నారు. మరి దిల్ రాజు ఈ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.













