ఆర్ఆర్ఆర్ కు ప్రధాని మోదీ అభినందనలు
ఆర్ఆర్ఆర్ చిత్రబృందంపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఈ చిత్రం సొంతం చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి అభినంనదలు తెలుపుతూ తాజాగా ప్రధాని ట్వీట్ చేశారు. ఇదొక విశేషమైన విజయం. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ, చంద్రబోస్‌తో పాటు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇతర చిత్ర బృందానికి నా అభినందనలు. ఈ ప్రతిష్ఠాత్మక విజయంతో ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా చేశారు అని ఆయన పేర్కొన్నారు.













