ప్లానింగ్ గీతాలు విడుదల
మహేంద్ర, మమత కులకర్ణి జంటగా నటిస్తున్న చిత్రం ప్లానింగ్. బిఎల్. ప్రసాద్ దర్శకుడు. టి.వి.రంగసాయి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆలీషా ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమా పాటలను మార్కెట్లోకి విడుదల చేశారు. హైదరాబాద్‌లో ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన విడుదల కార్యక్రమంలో సి.కల్యాణ్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. రామసత్యనారాయణ, సాయి వెంకట్, దర్శకుడు భాను కిరణ్, సంజయ్ తదితరులు పాల్గొని పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ పాటలు బావున్నాయి. వాటి చిత్రీకరణ సైతం బాగుంది. చిన్న సినిమా అయినప్పటికీ చక్కని ప్లానింగ్‌తో తీశారు. హీరో, హీరోయిన్లు చక్కని నటన ప్రదర్శించారు. సినిమా మంచి విజయం సాధిస్తుంది అన్నారు. నిర్మాత రంగసాయి మాట్లాడుతూ ఈ సినిమాకు వెన్నుదన్నుగా నిలిచిన కల్యాణ్‌గారికి, ఇతర స్నేహితులకు కృతజ్ఞతలు. యూనిట్ సభ్యులందరూ చక్కటి సహకారం అందించారు అని అన్నారు. అతిథులందరూ సినిమా గురించి ప్రసంగించారు.













