కల్కి రిలీజ్ డేట్ వెనుక ప్లాన్ అదే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కల్కి 2898ఏడి. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి స్టార్స్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాలో నాగ్ అశ్విన్ సరికొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ కు పరిచయం చేయబోతున్నాడు. ముందుగా కల్కిని మే 9న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఎలక్షన్స్ ఉండటంతో ఆ హడావిడి సినిమా కలెక్షన్స్, ఓపెనింగ్స్ పై పడుతుందని సినిమాను వాయిదా వేశారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా కావడంతో సినిమాను థియేట్రికల్ రైట్స్ ను కూడా భారీ మొత్తానికి అమ్ముతున్నట్లు తెలుస్తోంది.
హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో వేరే ఏ సినిమాతో పోటీ లేని డేట్ ను ఫిక్స్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రస్తుతం రెండు ఆప్షన్స్ కు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మే 30, జూన్ 20లో ఒక రోజుని కల్కి రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట.
ముందుగా మే 30కు రిలీజ్ బాగుంటుందనుకున్నప్పటికీ జూన్ 20 అయితే సోలో రిలీజ్ గా ఉంటుందని డెసిషన్ ను మార్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. జూన్ 20న ఇంటర్నేషనల్ లెవెల్ లో పెద్ద సినిమాలేవీ రిలీజ్ లు లేకపోవడంతో అదే బెస్ట్ డేట్ అని భావిస్తున్నారట. ఈ సినిమాతో ప్రభాస్, బాహుబలి 2 కలెక్షన్స్ ను బ్రేక్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17న కల్కి కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే ఛాన్సుందని టాక్.













