Kirthi Kulhari: పింక్ షూటింగులో ఎంతో ఇబ్బంది పడ్డా: కీర్తి కుల్హారి
అమితాబ్ బచ్చన్(Amithab Bachan), తాప్సీ(Taapse), కీర్తి కుల్హారి(Kirthi Kulhari) ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ పింక్(Pink) ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. అమితాబ్ బచ్చన్ లాయర్ గా కనిపించిన ఈ మూవీలో తాప్సీ పాత్రకు సమానంగా కీర్తి కుల్హారి పాత్ర కూడా ఉంటుంది. కానీ ఆ సినిమా టైమ్ లో మాత్రం తనను అలా చూసేవారు కాదని, ఆ టైమ్ లో తాను ఎన్నో ఇబ్బందులు పడినట్టు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కీర్తి తెలిపింది.
షూటింగ్ నుంచి ప్రమోషన్స్ వరకు ఎప్పుడూ తనకు సరైన గుర్తింపు దక్కలేదని, అమితాబ్ తర్వాత పింక్ మూవీలో మంచి గుర్తింపు అందుకుంది తాప్సీ మాత్రమేనని కీర్తి వెల్లడించింది. ఇండస్ట్రీలో అందరినీ ఒకేలా చూస్తారనుకున్నానని, కానీ పింక్ షూటింగ్ లో తాను చాలా ఇబ్బందులు పడ్డట్టు, ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకున్నట్టు కీర్తి చెప్పింది.
ట్రైలర్ వచ్చాక అందులో మొత్తం కేవలం అమితాబ్, తాప్సీకి సంబంధించిన సీన్సే ఉండటం చూసి ఎంతో బాధపడ్డానని, తన బాధను అర్థం చేసుకున్న పింక్ రైటర్ సుజిత్(Sujith) బాధపడొద్దని, సినిమా ఫినిష్ అయ్యాక నీ గుర్తింపు నీకొస్తుందని సర్దిచెప్పారని తెలిపింది. కానీ సినిమా పూర్తయ్యాక ప్రమోషన్స్ టైమ్ లో కూడా అందరూ తాప్సీ నే ఫోకస్ చేసేవాళ్లని, అదంతా పీఆర్ స్ట్రాటజీ అని తనకు తెలియడానికి చాలా టైమ్ పట్టిందని చెప్పిన కీర్తి, ఆ తర్వాత నుంచి తాను కూడా పీఆర్ గేమ్ పై దృష్టి పెట్టినట్టు తెలిపింది.













