అప్పుడు ‘బాషా’… ఇప్పుడు ‘పేటా’
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం పేటా.ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతోంది. త్రిష కథానాయిక. సిమ్రాన్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. వల్లభనేని అశోక్ నిర్మాత. ఆయన మాట్లాడుతూ పిజ్జా, జిగర్తాండ చిత్రాలతో ఆకట్టుకున్న దక్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. తను రజనీకాంత్‌కి వీరాభిమాని. రజనీని మాస్‌కి నచ్చేలా పేటా లో చూపించబోతున్నారు. ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. అనిరుథ్ అందించిన సంగీతం అందరికీ ఆకట్టుకుంటోంది. బాషా తరవాత సంక్రాంతి బరిలో ఉన్న రజనీ సినిమా ఇదే. బాషా లా పేటా కూడా సంచలనాలు సృష్టిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.













