Peddi: పెద్ది నుంచి కొత్త పోస్టర్.. ఫ్యాన్స్ కు అనుకోని ట్రీట్

శంకర్(sankar) దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా ఎన్నో అంచనాలతో రిలీజైన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గేమ్ ఛేంజర్ ఫలితంగా డిజప్పాయింట్ అయిన చరణ్ ఫ్యాన్స్ తమ హీరో నెక్ట్స్ మూవీ అయిన పెద్ది(Peddi) పైనే తమ ఆశలన్నింటినీ పెట్టుకున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన(Buchibabu Sana) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలుండగా, తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. రామ్ చరణ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద చిత్ర యూనిట్ మూవీ నుంచి ఓ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేయగా, దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
పోస్టర్ లో చరణ్ రైల్వే ట్రాక్ పై ఎంతో స్టైలిష్ గా నిలబడి ఉండగా, అతని లుక్స్ కూడా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ మూవీలో చరణ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు చరణ్ నుంచి వచ్చిన అన్ని సినిమాల కంటే పెద్ది చాలా కొత్తగా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.