ఫైటర్ పైలెట్‌గా పాయల్
పాయల్ రాజ్‌పుత్ ప్రత్యేక పాత్రలో జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నరేంద్ర. ఈషాన్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమాలో ఇండియన్ ఫస్ట్ ఫిమేల్ ఫైటర్ పైలెట్‌గా పాయల్ రాజ్‌పుత్ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నది. ఆమె పాత్ర శక్తివంతంగా ఉంటుందని చిత్రబృందం చెబుతున్నది. పాకిస్థాన్ జైలులో బందీ అయిన ఓ భారతీయ బాక్సర్ కథ ఇది. శత్రుదేశం నుంచి తప్పించుకున్న ఆ బాక్సర్ ఎలా మాతృభూమికి చేరుకున్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. నీలేష్ హీరోగా నటిస్తున్నారు. మానవహక్కుల కార్యకర్తగా కథానాయికగా ఇజాబెల్లె కనిపిస్తున్నది. చిత్రీకరణ ముగింపునకు చేరుకున్నది. వేసవిలో విడుదల చేస్తాం అని దర్శకుడు చెప్పారు.













