Ustaad Bhagath Singh: దేవీ పాటకు 400 మందితో పవన్ మాస్ స్టెప్పులు

ఓ వైపు పాలిటిక్స్, మరో వైపు సినిమాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kayan) చాలా బిజీగా ఉన్నారు. రీసెంట్ గా హరిహర వీరమల్లు(hari hara veeramallu) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్, ఈ నెలాఖరుకి ఓజి(OG) సినిమాను రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 25న ఓజి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ప్రస్తుతం పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad Bhagath Singh) సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్(Pawan). మామూలుగానే ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దానికి తోడు హరీష్- పవన్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్(Gabbar Singh) తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్‌సింగ్‌పై భారీ హైప్ నెలకొంది. ఆ హైప్, అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాడు హరీష్.
ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ప్రస్తుతం 400 మంది డ్యాన్సర్లతో ఓ పాటను షూట్ చేస్తున్నారట చిత్ర యూనిట్. చాన్నాళ్ల తర్వాత దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సాంగ్ కు పవన్ స్టెప్పులేస్తున్నారని, ఈ సాంగ్ పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెడుతుందని చెప్తున్నారు. శ్రీలీల(Sree Leela), రాశీ ఖన్నా(Raashi Khanna) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.