సౌండ్ లేకుండా వస్తున్న ఫహద్ మూవీ
కేజీఎఫ్ ను నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ హోంబాలే ఫిల్మ్స్ కు ఇప్పుడు నిర్మాణంలో ఉన్న సినిమాలన్నీ భారీ పాన్ ఇండియన్ సినిమాలే. కానీ ప్రభాస్ పెద్ద హీరో కావడంతో అందరి దృష్టి సలారే పైనే ఉది. ఈ బ్యానర్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ధూమం. జూన్ 23న ఈ సినిమా మల్టీ లాంగ్వేజెస్లో రిలీజ్ కాబోతుంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది లేదు.
కేవలం నాలుగు రోజులో ఉన్న ఈ సినిమా అన్ని భాషల్లో ఒకే రోజు రిలీజ్ అవుతుందా అనే అనుమానాలొస్తున్నాయి. ఇదే బ్యానర్ నుంచి వచ్చిన కాంతార సినిమా టూ వీక్స్ లేట్ గా డబ్బింగ్ రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది. దీనికి కూడా అదే ఫార్ములాని వాడతారేమోననే డౌట్ అందరికీ వస్తుందిప్పుడు.
కానీ బుకింగ్ యాప్స్ లో ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రెండ్రోజుల్లో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ తీసుకురావడం కష్టమే కాబట్టి ఈ సినిమా టాక్ ను బట్టి రిజల్ట్ ఉండనుంది. పవన్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మొదట్లో పునీత్ రాజ్ కుమార్ తో అనుకున్నారు కానీ అది ఫహద్ ఫాసిల్ కు వచ్చింది. ఫహద్ తెలుగులో హీరోగా చేస్తున్న మొదటి సినిమా ఇదే. మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













