ఎలక్షన్స్ లోపు అలా ప్లాన్ చేసిన పవన్!
పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఎలక్షన్స్ లో ఓ స్ట్రాంగ్ పవర్ గా ఎదగడానికి పవన్ వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే మూడు దశల్లో వారాహి యాత్ర చేసి, నాలుగో దశ యాత్రకు రెడీ అవుతున్నాడు. మరోవైపు సినిమాల్లో తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని పవన్ డిసైడ్ అయ్యాడు.
హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమాకు అక్టోబర్ డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. పవన్ ఇది కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయట.
ఇదిలా ఉండగా పవన్-సురేందర్ రెడ్డి కాంబోలో రానున్న సినిమా ఓ పొలిటికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. మొదట్లో వీరిద్దరి కాంబోలో యాక్షన్ డ్రామాతో సినిమా తీద్దామనుకున్నప్పటికీ తర్వాత మళ్లీ స్టోరీని మార్చి పొలిటికల్ టచ్ ఇచ్చారని సమాచారం. వీలైనంత త్వరగా సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ సినిమా ఏపీ ఎలక్షన్స్ కంటే ముందు రిలీజ్ చేయాలని, అలా చేస్తే పవన్ పొలిటికల్ కెరీర్‌కు హెల్ప్ అవుతుందని ఆలోచిస్తున్నాడట. ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. నిజంగా ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలైతే మాత్రం ఈ వార్తల్లో నిజముందని నమ్మొచ్చు.













