Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా కూడా చేస్తాడా?

పవన్ కళ్యాణ్(pawan Kalyan) ప్రస్తుతం తను ఒప్పుకుని ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టిన సినిమాలన్నింటినీ వరుస పెట్టి పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. వాస్తవానికి ఈ సినిమాలు ఎప్పుడో పూర్తవాల్సింది కానీ పవన్ రాజకీయాల్లో బిజీ అవడంతో ఆ సినిమా షూటింగులు వాయిదా పడి ఆలస్యమయ్యాయి. ఇప్పుడు వీలు చూసుకుని పెండింగ్ షూటింగును పూర్తి చేస్తున్నాడు.
ఇప్పటికే హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu) సినిమా షూటింగ్ ను పూర్తి చేసి దాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్న పవన్, ఓజి(OG) సినిమా షూటింగ్ ను కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేశాడు. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagath Singh)సినిమాకు కూడా డేట్స్ కేటాయించనున్నట్టు సమాచారం. అయితే ఈ మూడు సినిమాలను ఫినిష్ చేశాక పవన్ ఇక సినిమాలకు బ్రేక్ ఇస్తాడని అందరూ భావిస్తున్నారు.
కానీ వీరమల్లు(Veeramallu2) సెకండ్ పార్ట్ చేశాకే పవన్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటాడని మరికొందరు భావిస్తున్నారు. వీటితో పాటూ ఇప్పుడు మరో కొత్త న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. పవన్ గతంలో సురేందర్ రెడ్డి(Surender Reddy)తో చేద్దామనుకున్న ప్రాజెక్టును కూడా చేసి, ఆ తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటాడని అంటున్నారు. రీసెంట్ గా సురేందర్ రెడ్డి, పవన్ ను కలిసి తన వద్ద ఆల్రెడీ ఫుల్ స్క్రిప్ట్ రెడీగా ఉందని చెప్పాడని సమాచారం. మరి సురేందర్ రెడ్డికి పవన్ ఏం చెప్పాడనేది తెలియాల్సి ఉంది.