ముగియనున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ..?
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కి మామూలు ఫాలోయింగ్ ఉండదు. హీరోగా అశేష ప్రేక్షకాభిమానాన్ని పొందిన బాలయ్య, ప్రముఖ ఓటీటీ దిగ్గజమైన ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో తో ఇటు అభిమానులకి, అటు ప్రేక్షకులకి బాలయ్య బాబు మరింత చేరువయ్యాడు అనడంలో అతిశయోక్తి లేదు. అన్ స్టాపబుల్ తో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు బాలకృష్ణ. సీజన్ 1 కి మంచి రెస్పాన్స్ రావడంతో, సీజన్ 2 ని స్టార్ట్ చేయడం జరిగింది.
అన్ స్టాపబుల్ సీజన్ 2 ని ప్రముఖ రాజకీయ నాయకుడైన నారా చంద్రబాబు నాయిడు తో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్లో ప్రముఖ స్టార్స్, పొలిటిషన్స్ పాల్గొని వినోదాన్ని పంచుతూనే తున్నారు. రీసెంట్ గా ప్రభాస్ కూడా బాలయ్య బాబుతో కలిసి అల్లరి చేసాడు. ఇక ఈ సీజన్ లో మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కోసం కోట్ల మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఒకవైపు నందమూరి నటవారసుడు, మరో వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే స్క్రీన్ పై కనిపించి ఆడియన్స్ కి వినోదాన్ని పంచనున్నారు.
ఇప్పటికే ప్రోమో ద్వారా ఈ ఎపిసోడ్ పై చాలా అంచనాలు పెరిగిపోయాయి. అయితే రీసెంట్ గా ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. అన్ స్టాపబుల్ సీజన్ 2 ముగియబోతుందని సమాచారం అందుతుంది. పవర్ స్టార్ దే ఈ సీజన్ కి లాస్ట్ ఎపిసోడ్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య బాబు సినిమాల్లో బిజీగా ఉండడం, రాజకీయాల్లో ఆక్టివ్ గా పాల్గొనడం దీనికి కారణం అని తెలుస్తుంది. తాత్కాలికంగా ఈ షో సీజన్ 2 తో ఎండ్ అయినా, మరొక కొత్త సీజన్ తో అన్ స్టాపబుల్ సరికొత్తగా ప్రేక్షకుల మందికి రాబోతుందట. అయితే సీజన్ త్రీ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.













