సినిమాలకు పవన్ గుడ్ బై?
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అజ్ఞాతవాసి తరువాత పవన్ చేస్తున్న సినిమా ఏదన్నది తెలియరావడం లేదు. జనసేన పార్టీ బలోపేతం చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల వరకు ఆయన సినిమాలకు దూరంగా ఉంటారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టలేనని, పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఏది ముందు పట్టాలెక్కుతుందో తెలియడం లేదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల తరువాత ఆయన రెండేళ్లకు ఓ సినిమా చేస్తారని టాలీవుడ్ వర్గాలు చెబుత్నుప్పటికీ, అది నిజయో కాదో తెలియడం లేదు. పూర్తిగా రాజకీయాల్లోకి దిగాలన్న ఆలోచనతోనే పవన్ నిర్మాతలు తనకు ఇచ్చిన అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేశారని టాలీవుడ్ వర్గాల కథనం మేరకు తెలుస్తోంది. జనసేనను బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై స్పందిస్తూ ముందుకు సాగాలన్న నిర్ణయంతో పవన్ ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన వచ్చే ఎన్నికల వరకే సినిమాలకు దూరంగా ఉండొచ్చని, ఎన్నికల తరువాత ఆయన తిరిగి సినిమాలు చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.













