ఆర్జివి పై సెటైరికల్ మూవీ ‘పరాన్నజీవి’ తీస్తున్న పవన్ అభిమాని
సినీ పరిశ్రమ లో కాలికేస్తే వేలికి, వెలికేస్తే కాలికి వేసేవాడు ఎవరంటే టక్కున సమాధానం వచ్చేది రామ్ గోపాల్ వర్మ, ఆ రోజు అలా అనుకున్నాను ఈ రోజు ఇలా మార్చుకున్నా అంటూ మూర్ఖంగా మాట్లాడేవాడు ఎవరంటే ఇంకెవరు రామ్ గోపాల్ వర్మ. స్వేచ్ఛ అని హక్కుని నానా విధాలుగా హింసింది, ఎవ్వరూ వాడుకోనంతగా వాడేసుకోవడం ఎవరి జీవితాల్లో అయినా తొంగి చూడడం బెడ్ రూమ్ గోడల్ని బద్దలు కొట్టుకుని మరీ దూసుకెళ్లిపోవడ వర్మ నైజం.సోషల్ మీడియా లేని రోజుల్లో అయితే ఆర్ జి వి పప్పులుడికేవీ కావు ఏ విషయం చెప్పాలన్న ప్రెస్ మీట్ పెట్టి , లేక ప్రెస్ నోట్ రాసి ప్రింట్ మీడియాకి ఇవ్వాల్సి వచ్చేది అక్కడ పేజీ ఇంచార్జి ఆర్ జి వి ఇచ్చే అడ్డగోలు స్టేట్మెంట్స్ పబ్లిష్ చేసేవారు కాదు. ఇప్పుడు ట్విట్టర్ ఉంది కదా అని ఏది పడితే అది వాగేసి, ఎంత పడితే అంత, ఎవరిపై పడితే వాళ్లకే కక్కేసే కక్కుర్తి బుద్ధి కేవలం వర్మకే ఉందన్నది ఆయన అభిమానులు యూత్ బలహీనతలను దృష్టిలో పెట్టుకుని ఆడవారిని ఆటబొమ్మల్లా చూపిస్తూ, పోర్న్ మూవీస్ తక్కువ సెక్స్ మూవీస్ కి ఎక్కవగా మసాలా దట్టిస్తూ, బయోపిక్ లని, యదార్ధ సంఘటనల సమాహారం అని, అప్పుడప్పుడు దెయ్యాలు ఉన్నాయని, రకరకాల సినిమాలు తీసి సొమ్ము చేసుకోవాలనుకోవడం ఆర్ జి వి వ్యాపార సూత్రం.
అలాంటి ఆర్ జి వి ఈ సారి పవన్ కళ్యాణ్ కున్న ఇమేజీని వాడుకుంటూ, తన తెలివి తేటలు ఉపయోగిస్తూ `పవర్ స్టార్` సినిమా తీస్తున్నాడు.ఇది పవన్ కల్యాణ్ సినిమా కాదు… అని చెపుతూ మరో పక్క ఎన్నికల ఫలితాలు తర్వాత కథ అంటూ లోగో మధ్యలో టీ గ్లాస్ పెట్టి – పవర్ స్టార్ అంటే ఎవరో, ఆ పేరు ఎవరి పేరు ముందు గర్వంగా నిలబడుతుందో తెలుగు ప్రేక్షకులకు, పవన్ అభిమానులకు తెలియంది కాదు జనాలు మరీ వెర్రి పప్పలనుకుంటున్నాడు వర్మ. పవన్ అభిమానుల్లో పవన్ ఇమేజ్నో పవన్ పేరునో వాడుకోకపోతే.. పూట గడవని వర్మ ఇప్పుడు ఏకంగా పవన్ పై సినిమా తీసే సాహసం చేస్తున్నాడు. ఎప్పటిలా జూనియర్ ఆర్టిస్టులకు తక్కువ డూప్లకు ఎక్కువ అనిపించే ఆర్టిస్టుల్ని వెదకి పట్టి కేవలం ఫ్రీ పబ్లిసిటీతో జిమ్మిక్కుల చేసి, టికెట్లు అమ్ముకోవడానికి వెంపర్లాడిపోతున్నాడు. దానికి తోడు కొన్ని న్యూస్ చానెల్స్ వారు ఈ మూర్ఖపు శిఖామణికి కొమ్ము కాస్తున్నారు.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతిసారి ముందుగా ఓ పాపులారటీ వున్నా వ్యక్తిని ఎంచుకోవడం ఆయా వ్యక్తిమీద ఏదో ట్వీట్ పెట్టడం అక్కడినుండి స్టార్ట్ అవుతుంది అలా అందరినీ ఆర్ జి వి కెలకడం తప్ప ఆర్ జి వి జోలికి పోవడానికి ఎవరూ సాహసం చేయరు. ఎందుకంటె అశుద్ధం మీద రాయి వేస్తే ఏమౌతుందీ….. అని భయపడి కానీ.. అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా..? అందరి మీద సినిమాలు తీసే ఆర్ జి వి పై ఓ సినిమా తీస్తున్నారిప్పుడు. ‘నీ పాపం పండెను నేడు నీ భారతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరెక్ట్ మొగుణ్ణి నేను’ అంటూ ఆర్జివిని కాలర్ పట్టుకుని, తలను తన్నేవాడుంటే తాటిని తన్నేవాడు వస్తాడు అన్నట్టు ‘ఒకడొచ్చాడు’. ఆ చిత్రం పేరు `పరాన్న జీవి’. ఎప్పుడూ ఇతరులమీద వాళ్ళ జీవిత కథల మీద ఆధార పడి సినిమాలు తీసి బతికేసే గెట్ ఆన్ ఆవుతున్న ఆర్ జి వి భలే సూటైపోయిన టైటిల్ పెట్టాడు ఓ పవన్ అభిమాని. పవన్ పై ఆర్ జి వి సినిమా తీస్తుంటే.. ఆర్ జి వి పై పవన్ అభిమాని ఓ సినిమా తీయడం ఆర్ జి విపై సెటైరికల్ సినిమా తీయాలని చాలామంది అనుకున్నారు. కానీ బురదలో రాళ్లేయడం ఎందుకని… ఆగిపోయారు.
కానీ ఆర్ జి వి బురద కాదు. బురదలో దొర్లే పశువు అనుకున్నాడే ఏమో.. ఓ అభిమాని తిరగబడడానికి సిద్ధమయ్యాడు. దానికి ఫలితమే `పరాన్న జీవి` సినిమా. పవన్ గురించి ఆర్ జి వి ఏం తీస్తాడో, ఎలాంటి సినిమాలు తీస్తాడో ఊహించ వచ్చు. కానీ.. ఆర్ జి వి పై పవన్ అభిమాని ఎలాంటి సినిమా తీస్తాడో? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అటు ఆర్ జి వి తీసే `పవర్ స్టార్`, ఇటు ఆర్జీవిపై తీస్తున్న `పరాన్నజీవి` లకు టగ్ అఫ్ వార్ మొదలైంది. యావత్ పవన్ అభిమానుల అండ దండదండలు `పరాన్నజీవి`పై ఉంటాయనడంలో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ `పవర్ స్టార్` కోసం ఎదురు చూడ్డంలో ఆశ్చర్యం లేదు. అటు పవన్ యాంటీ ఫ్యాన్సా? ఇటు పవన్ అసలైన అభిమానులా? అనేది త్వరలో తేలనుంది.













