సత్యనారాయణ గారికి పద్మశ్రీ పురస్కారం రావడానికి తెలుగు రాష్ట్రాలు కృషి చెయ్యాలి – పవన్ కళ్యాణ్
నటుడిగా నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో లెజెండరీ ఆర్టిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు పొందినా కూడా భారత ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎలాంటి పద్మ అవార్డు రాకపోవడం అయన నట జీవితం లో ఓ లోటు. అని గుర్తించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు. “నవరస నటసార్వభౌమూడు అని తెలుగు సినీ ప్రేక్షకులు కీర్తించే మాన్యులు శ్రీ కైకాల సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో అయన పోషించిన అన్ని పాత్రలు అజరామరం అని చెప్పడం అతిశయోక్తి కాదు. నవరసాలను అలవోకగా పండించగల శ్రీ సత్యనారాయణ గారు తెలుగు నేలపై జన్మించడం తెలుగువారి అదృష్టంగా చెప్పవచ్చు. సినిమా పరిశ్రమ హైదరాబాద్ తరలి రావడానికి శ్రీ సత్యనారాయణగారు కూడా తనదైన కృషి చేసారు. సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి ఎందరో ఔత్సహిక కళాకారులకి ఆదర్శంగా నిలిచారు. మద్రాస్ లో ఉన్నకాలం నుంచే మా కుటుంభం తో పాటు నాకు వ్యక్తిగతంగా ఆయనతో నాకు అనుబంధం ఉండేది. అయన కలిసినప్పుడల్లా చాలా వాత్సల్యంతో మాట్లాడేవారు. ముఖ్యంగా అయన మచిలీపట్టణం నుండి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన సందర్భంలో ఆయనను కలిసిన మధుర క్షణాలు నాకు ఇప్పటికి స్ఫురణకు వస్తాయి. నటనలో అయన ఎంతో ఎత్తుకు ఎదిగిన శ్రీ సత్యనారాయణ గారికి భారత ప్రభుత్వం పరంగా ఎటువంటి గుర్తింపు రానందున అయన అభిమానులు, శ్రేయోభిలాషులతో పాటు నాకు ఒక్కింత భాద వుంది. శ్రీ సత్యనారాయణ గారికి పద్మశ్రీ పురస్కారం అందించే విధంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు కృషి చేయాలనీ అయన జన్మదిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ సత్యనారాయణ గారు ఆనందకరమైన సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నాను. ఆయనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ భగవానాథుడిని ప్రార్ధిస్తున్నాను”. ఇట్లు సం. పవన్ కళ్యాణ్, అధ్యక్షులు-జనసేన పార్టీ













