రిపీట్ అవ్వబోతున్న హిట్ కాంబో…
ఒక్కసారి డైరెక్టర్, హీరో కాంబినేషన్ లో హిట్ పడితే, మళ్లీ ఆ ఇద్దరు కలిసి ఎప్పుడు సినిమా వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు.ఆ కాంబినేషన్ లో వచ్చే నెక్స్ట్ సినిమాపై భారీగా అంచనాలు ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి క్రేజీ కాంబో సెట్ చేసే పనిలో ఉన్నారు నిర్మాత దిల్ రాజు. ఇంతకీ ఎవరా హిట్ కాంబినేషన్? అని డౌట్ రావడం ఖాయం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పరశురాం కలయికలో సూపర్ సినిమా ప్లాన్ చేస్తున్నారట నిర్మాత దిల్ రాజు.
హీరో విజయ్ కి “గీతా గోవిందం” లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరశురాం తో సినిమా చేయడానికి రెడీ అంటున్నాడు. ఈ హీరో లైగర్ సినిమా తర్వాత హీరోయిన్ సమంత తో కలిసి “ఖుషి” సినిమా చేయాల్సి ఉంది. కానీ, సామ్ అనారోగ్యం వల్ల ఆ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అందుకే ఈ గాప్ లోనే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరశురాం తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు విజయ్.
నిర్మాత దిల్ రాజు దగ్గర విజయ్ డేట్స్ అందుబాటులో ఉండటంతో ఈ కాంబోకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు అని సమాచారం. పరశురాం తో కూడా కొన్నాళ్లుగా సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడు దిల్ రాజు. ఫైనల్ గా హిట్టు కాంబో కుదిరింది. సర్కారు వారి పాట తర్వాత పరశురాం అసలైతే నాగ చైతన్యతో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో ముందుకు సాగలేదు. అదే సినిమా కథని విజయ్ దేవరకొండ ఇమేజ్ కి తగిన విధిగా మార్చి సినిమా చేయబోతున్నారట. పరశురాం మీద నమ్మకంతోనే విజయ్ ఈ సినిమా ఓకే చెప్పారట. మరి గీతా గోవిందం కాంబో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.













