Parasuram: సిద్దూతో ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ సినిమా?
టిల్లు ఫ్రాంచైజ్(Tillu Jonnalagadda) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్(Bommarilu Bhaskar) దర్శకత్వంలో వైష్ణవి చైతన్య(Vyshnavi Chaitanya) హీరోయిన్ గా రూపొందుతున్న జాక్(Jaac) సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సిద్దు రొమాంటిక్ వరల్డ్ కు దూరంగానే కనిపించనున్నట్లు అర్థమవుతోంది.
జాక్ తో పాటూ సిద్దూ, నీరజ కోన(Neeraja Kona) దర్శకత్వంలో తెలుసు కదా(Thelusu Kadha) సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ కు తెలుసు కదా రిలీజయ్యే ఛాన్సుంది. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో చేస్తున్న కోహినూర్(Kohinoor) నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సిద్దూ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
గతేడాది ఫ్యామిలీ స్టార్(Family Star) తో డిజాస్టర్ అందుకున్న పరశురామ్(Parasuram) చెప్పిన కథకు సిద్దూ ఓకే చెప్పాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయినప్పుడు మరో సినిమా చేయాలని అప్పట్లోనే దిల్ రాజు(Dil Raju), పరశురామ్ డీల్ కుదుర్చుకోగా, ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఇద్దరూ కలిసి సిద్దూతో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. కథా నేపథ్యం ఏంటన్నది తెలియదు కానీ గీత గోవిందం(Geetha Govindam) లాగా ఫ్యామిలీ ఎంటర్టైనరే అని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమ్మర్ నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి.













