పరశురామ్.. ఇది టూ మచ్!
గీత గోవిందం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న పరశురామ్ పెట్ల ఆ తర్వాత మహేష్ బాబు తో సర్కారు వారి పాట సినిమా చేసి మంచి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు బ్యానర్లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ పరశురామ్. రీసెంట్గా రిలీజైన ఫ్యామిలీ స్టార్ టీజర్ ప్రేక్షకుల్ని బాగా అలరించింది.
ఫ్యామిలీ స్టార్ సినిమాను పరశురామ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నాడనేది టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న పరుశురామ్ ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ను పెంచేసినట్లు తెలుస్తోంది. తను ప్రస్తుతం చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాకు పరశురామ్ ఏకంగా రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.
ఓ డైరెక్టర్ కు రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ అనేది చాలా ఎక్కువనే చెప్పాలి. కేవలం మహేష్ తో సినిమా చేయడం, దానికి తోడు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడం వల్లే పరశురామ్‌కు ఈ రేంజ్ డిమాండ్ ఏర్పడింది. లేదంటే పరశురామ్ లాంటి డైరెక్టర్ కు రూ.15 కోట్లు ఏ నిర్మాత ఇవ్వలేడు. ఏదేమైనా సర్కారు వారి పాట సినిమాతో తన రేంజ్‌ను బాగానే పెంచుకున్నాడు పరశురామ్.













