Pandiraj: సేతుపతితో సినిమా చేయకూడదనుకున్నా

నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ పాండిరాజ్(Pandiraj), విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కలయికలో వస్తోన్న సినిమా తలైవన్ తలైవి(Thalaivan thalaivi). జులై 25న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నిత్యా మీనన్(Nithya menon) హీరోయిన్ గా నటించగా, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ పాండిరాజ్ వెల్లడించిన విషయాలు విజయ్ సేతుపతి గొప్పదనాన్ని వివరిస్తున్నాయి. గతంలో తనకు, విజయ్ సేతుపతికి మధ్య అభిప్రాయ భేదాలుండేవని, ఆ కారణంతో తామిద్దరూ కలిసి లైఫ్ లో సినిమాలు చేయకూడదనుకున్నామని తెలిపారు. కానీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకవుతుందన్నట్టు కొన్ని పరిస్థితులు తమ నిర్ణయాన్ని మార్చేశాయన్నారు పాండిరాజ్.
డైరెక్టర్ మిష్కిన్(Mishkin) బర్త్ డే పార్టీలో తామిద్దరం మళ్లీ కలిశామని, ఆ టైమ్ లో సేతుపతి మనం కలిసి ఓ సినిమా చేద్దామన్నారని, ఆయన మాటలు తన గుండెను తాకాయని, దాంతో తమ మధ్య దూరం తొలగిపోయి పాత విభేదాలు పక్కన పెట్టి కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినట్టు పాండిరాజ్ తెలిపారు. మిష్కిన్ బర్త్ డే పార్టీ తర్వాతే తాను ఈ సినిమా కథ రాశానని, కథకు సేతుపతి అయితేనే కరెక్ట్ అనుకుని ఆయన దగ్గరకు వెళ్తే 20 నిమిషాలు కథ చెప్పగానే ఆయన వెంటనే ఓకే అన్నారని సేతుపతి గొప్పదనాన్ని బయటపెట్టారు పాండిరాజ్.