Panch Minar: ‘పాంచ్ మినార్’ సినిమాని థియేటర్స్ లో మిస్ అవ్వొద్దు- రాజ్ తరుణ్
యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరో ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ ‘పాంచ్ మినార్’. రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ లో రాశి సింగ్ హీరోయిన్ గా నటించింది. గోవింద రాజు ప్రజెంట్ చేసిన ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మించారు. నవంబర్ 21న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
సక్సెస్ మీట్ లో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. . ఈ సినిమాకి మీడియా వారు ఇస్తున్న సపోర్ట్ కి థాంక్యూ. శ్రీనివాస్ రెడ్డి గారికి నేను ఫ్యాన్ బాయ్. ఆయనతో కలిసి పనిచేసిన అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన వెంకీ సినిమాకి ఇప్పటికీ ఒకేలా ఉన్నారు. శేఖర్ చంద్ర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్ అదిరిపోయింది. థియేటర్స్ కి వెళ్ళాము. అందరూ కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. నా సినిమా థియేటర్స్ విజిట్ కి వెళ్ళినప్పుడు జనాలు అంతా ఎంజాయ్ చేస్తూ చూడడం నిజంగా చాలా రోజులైంది. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మా ప్రొడ్యూసర్ మాధవి గారికి మంచి సినిమా చేయాలని తపన కథ మీద ఉన్న నమ్మకం, మా డైరెక్టర్ పడ్డ కష్టం, ఈ సినిమాకి ఏదైనా తెచ్చి పెట్టాలని మా గోవిందరాజు గారు ఆయనపై వేసుకున్న భారం.. ఇవన్నీ కలిసి నాకు దొరికిన అదృష్టం పాంచ్ మినార్. చూసిన ప్రేక్షకులందరికీ థాంక్యూ వెరీ మచ్. రేపు థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయబోతున్నవారికి అడ్వాన్స్ థాంక్యూ వెరీ మచ్. ఒక రెండు గంటలు ఫ్యామిలీతో కలిసి హాయిగా ఎంజాయ్ చేయాలనుకుంటే పాంచ్ మినార్ కి వెళ్ళండి. కచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అందరూ ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. నిన్న దేవి థియేటర్ కి వెళ్ళాను. సినిమా చూసినోళ్లు అందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మంచి ఫన్ ప్యాక్ ఫిలిం. గోవిందరాజు గారు ఆల్ ఇన్ వన్ ప్రొడ్యూసర్. సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మాధవి గారు చాలా ఫ్యాషన్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. చాలా ఫన్ ఎక్స్పీరియన్స్ తో ఈ సినిమా జరిగింది. రమేష్ గారు చాలా క్లారిటీతో ఉన్న డైరెక్టర్. రాజ్ తరుణ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇది ఆయన కెరీర్ లో మరో అద్భుతమైన సినిమా కావాలని కోరుకుంటున్నాను.
గోవిందరాజు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మనస్ఫూర్తిగా రెండు గంటలు నవ్వుకునే సినిమా తీయాలని నాకు ఎప్పటినుంచో కోరిక. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఒక్కరిని మీరు పేరుతో గుర్తు పెట్టుకుంటారు. ప్రతి చిన్న క్యారెక్టర్ కి అంత వర్క్ ఉంది. ఈ సినిమా మేము ఫైనాన్షియల్ గా సక్సెస్ అయ్యాము. దానికంటే మించిన ఆనందం ప్రేక్షకులు సినిమా చూసి బయటికి వస్తున్నప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం కనిపించింది. అది మాకు గొప్ప సక్సెస్. సెకండ్ హాఫ్ లో థియేటర్స్ లో సీట్లను ఊగుతూనే ఉన్నాయి. అంత మంచి కామెడీ ఉంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అవ్వొద్దు. ఇలాంటి మంచి సినిమాలు అందరూ నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా ఈ సినిమా టికెట్ రేట్లు కూడా తగ్గించాము. తప్పకుండా ఈ సినిమాని మీరు థియేటర్స్ లో చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ రామ్ మాట్లాడుతూ.. మా సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మీడియా మిత్రులు చాలా మంచి రేటింగ్స్ ఇచ్చారు. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. సినిమాకి మౌత్ చాలా అద్భుతంగా వచ్చింది. ఫుట్ ఫాల్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ సక్సెస్ ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా నిర్మాతలు మాధవి గారికి గోవింద్ గారికి థాంక్యూ. శ్రీనివాస్ రెడ్డి గారి సీన్స్ అన్నిటికీ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా సెకండ్ హాఫ్ అంత నవ్వుతూనే ఉన్నారు. అంత మంచి కామెడీ సినిమాల్లో కుదిరింది. సినిమాలో 70 సీట్లు ఉంటే 60 సీన్లుకు జనం నవ్వుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడండి. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది రాజ్ తరుణ్ కం బ్యాక్ అని చెప్పాను. ఇప్పుడు మరోసారి చెప్తున్నాను. ఇది రాజ్ తరుణ్ కం బ్యాక్ మూవీ. ఆయన పెర్ఫార్మన్స్ ఏంటో ఈ సినిమాలో చూస్తారు. తప్పకుండా ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి థియేటర్స్ లో చూడండి.
మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ… సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. చూసినోళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. సాంగ్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా మంచి పేరు వచ్చింది. రాజ్ తరుణ్ గారితో ఇది నాకు నాలుగో సినిమా. మా కాంబినేషన్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను
శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… సినిమాకి ఆడియన్స్ నుంచి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. మా డైరెక్టర్ గారు చాలా ఫ్రీడం ఇచ్చారు. సినిమాలోని ప్రతి సీన్ ని జనాలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు . రాజ్ తరుణ్ గారు వినపడదనే క్యారెక్టర్ లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అద్భుతమైన టైం కామెడీ టైమింగ్ తో చేశారు. పిల్లలతో కలిసి చూసే సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. తప్పకుండా ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను
ప్రొడ్యూసర్ మాధవి మాట్లాడుతూ… అందరికి నమస్కారం. మా సినిమాకి మంచి రేటింగ్ ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మా సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా నవ్వుకుంటూ వెళ్లారు. ఇది కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. రెండు గంటల పాటు నాన్ స్టాప్ నవ్వులు ఎంజాయ్ చేస్తారు. గోవిందరాజు గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఈరోజు ఈ స్టేజ్ కి వచ్చిందంటే కారణం ఆయనే. రాజ్ తరుణ్ గారు మిగతా అందరు కూడా చాలా అద్భుతంగా నటించారు. డైరెక్టర్ గారు ప్రతి క్యారెక్టర్ చాలా చక్కగా తీర్చిదిద్దారు. తప్పకుండా ఈ సినిమా అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.






