ప్రభాస్ సినిమాల గురించి రోజుకో వార్త
మార్కెట్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం ప్రభాస్(Prabhas) ను అందుకునే రేంజ్ లో మరే ఇండియన్ హీరో లేడు. బాహుబలి(Baahubali)తో ఎవరికీ సాధ్యపడని స్థాయిని అందుకున్న డార్లింగ్ తర్వాత వరుసగా భారీ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్(The Raja Saab), హను రాఘవపూడి(Hanu Raghavapudi) సినిమాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండా తన చేతిలో సలార్2(Salaar2), కల్కి2(Kalki2), స్పిరిట్(Spirit) సినిమాలున్నాయి.
ఇవన్నీ పూర్తి చేయడానికి ఎంతలేదన్నా ప్రభాస్ కు మరో మూడేళ్లు కావాలి. కానీ నెట్టింట మాత్రం ప్రభాస్ కొత్త సినిమాల గురించి ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. రణ్వీర్ సింగ్(Ranvir Singh) తో ప్రశాంత్ వర్మ(Prasanth Varma) చేయాల్సిన బ్రహ్మ రాక్షస(Brahma Rakshasa) అనౌన్స్మెంట్ వరకు వెళ్లి క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కథనే ప్రభాస్ తో చేయాలని ప్రశాంత్ వర్మ చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో క్యారెక్టర్ పై ప్రభాస్ ఆసక్తి చూపిస్తున్నాడని, త్వరలోనే సినిమాను అనౌన్స్ చేయొచ్చని ప్రచారం జరుగుతుంది. హనుమాన్(Hanuman) తో తనపై అంచనాలు పెరగడంతో ప్రశాంత్ వర్మ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాల అప్డేట్స్ ఇస్తున్నాడు. వాటిలో ఏ సినిమా ముందు స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు. కాబట్టి ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ సినిమా కచ్ఛితంగా ఉంటుందని చెప్పలేం. అంతేకాదు ఆదిపురుష్(Adipurush) డైరెక్టర్ ఓం రౌత్(Om Rauth) దర్శకత్వంలో కూడా ప్రభాస్ మరో సినిమా చేయనున్నాడని, ఈసారి ఓం ఎక్కువ టైమ్ తీసుకుని ప్రభాస్ కోసం మంచి కథ రెడీ చేశాడని, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో చేయాలనుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో న్యూస్ వినిపిస్తోంది. మరి ఆదిపురుష్ తో ఒకసారి దెబ్బతిన్న ప్రభాస్ మళ్లీ ఓం తో సినిమా చేసే సాహసం చేస్తాడా అనేది అనుమానమే.













