Palak Tiwari: డిజైనర్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న పాలక్

ప్రముఖ టెలివిజన్ నటి శ్వేతా తివారీ(Swetha Tiwari) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పాలక్ తివారీ(palak tiwari) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సైఫ్ అలీ ఖాన్(saif ali khan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) గర్ల్‌ఫ్రెండ్ గా అమ్మడి పేరు ఈ మధ్య బాగా వినిపిస్తోంది. స్టార్ కిడ్ అయినప్పటికీ తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న పాలక్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ వరుస ఫోటోషూట్ లతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే పాలక్ తాజాగా నియాన్ గ్రీన్ హాఫ్ షోల్డర్ డ్రెస్ లో తన అందాలన్నీ ఎలివేట్ అయ్యేలా ఫోటోలకు పోజులిచ్చి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతుండగా, ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.