ఆ సినిమాలకు ఇప్పుడైనా మోక్షం కలిగేనా?
ఈ నెలలో ఓటీటీలోకి రానున్న సినిమాలు హాట్ టాపిక్ గా మారేలా ఉన్నాయి. ఎంతో కాలంగా ఓటీటీ రిలీజ్‌ల కోసం ఎదురుచూస్తున్న కొన్ని సినిమాలు ఎట్టకేలకు డిజిటల్ రిలీజ్ కు రెడీ అయ్యాయి. వీటిలో ముందుగా అఖిల్ ఏజెంట్. ఈ సినిమా గతేడాది ఏప్రిల్ లో రిలీజైంది. ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. ఇప్పటికే మూడు సార్లు డిజిటల్ రిలీజ్ అనౌన్స్ చేశారు కానీ ఎందుకో ఆగిపోయింది. మొత్తానికి ఈ నెలాఖరులో సోనీలివ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇదే లిస్ట్ లో శర్వానంద్, కృతి శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన మనమే కూడా ఉంది. కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల ఈ సినిమా ఓటీటీ రిలీజ్ లేటయింది. ఇప్పుడు ఆ సమస్యలు తొలగిపోవడంతో రిలీజ్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రైమ్ లో మనమే రిలీజ్ కావొచ్చంటున్నారు.
వీటితో పాటూ చాలా కాలంగా ఓటీటీలోకి రావాలని చూస్తున్న లాల్ సలామ్ కూడా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిందట. ఫిబ్రవరిలో రిలీజైన ఈ సినిమా ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. సెప్టెంబర్ 20న సన్‌నెక్ట్స్ లో ఈ సినిమా రానుందట. అలాగే మలయాళ క్రైమ్ థ్రిల్లర్ తలవన్ సెప్టెంబర్ 10న సోనీలివ్ లో రిలీజ్ కానుంది. పంజాబీ రొమాంటిక్ కామెడీ జట్ అండ్ జూలియట్3 కూడా ఈ నెల 19న రిలీజ్ కానుందట. కీర్తి సురేష్ రఘుతాత సెప్టెంబర్ 13న జీ5లో రానుంది. ఇలా సెప్టెంబర్ లో ఎన్నో భాషలకు సంబంధించిన క్రేజీ సినిమాలు ఓటీటీ ద్వారా ఆడియన్స్ ముందుకు రానున్నాయి.













