పనిలేని ప్రశంసలు చేస్తున్న ఓం రౌత్
సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ రోజుల్లో ఎవరైనా సరే నలుగురిలో వైరల అవాలంటే అసందర్భమైన కామెంట్స్ కానీ ప్రసంగాలు కానీ చేస్తే సరి. కొన్నాళ్లకిందట అర్షద్ వార్సీ కల్కి సినిమాలో ప్రభాస్ ను ఉద్దేశించి అన్న మాటలు ఎంతో దూరం వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంచుమించు అలానే ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ పాపులారిటీ అవాలని కోరుకుంటున్నాడు.
గతేడాది ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చెప్పుకోడానికి రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ అయితే వచ్చాయి కానీ వాస్తవానికి ఆ సినిమా రేంజ్ అది కాదు. రామాయణ కథను అంచనాలకు తగ్గట్టు తీసుంటే సినిమా కనీసం వెయ్యు కోట్లు కలెక్ట్ చేసుండేది.
మొత్తానికి ఆదిపురుష్ ఫ్లాప్ కంటే దారుణంగా డిజాస్టర్ అయింది. కానీ ఈ విషయాన్ని డైరెక్టర్ ఓం రౌత్ ఒప్పుకోవడం లేదు. బాక్సాఫీస్ కలెక్షన్స్ ను బట్టే హిట్స్ ను లెక్కేస్తారు కాబట్టి ఆదిపురుష్ రేంజ్ ఏంటనేది మీరే డిసైడ్ అవండన్నాడు. అంతేకాదు ఆన్ లైన్ ట్రోలింగ్ గురించి తను పట్టించుకోనని, ప్రభాస్ హిట్టు ఫ్లాపుకు అతీతమైన హీరో అని పనిలో పనిలో అవసరం లేని ప్రశంసలు చేశాడు. ఇన్ని చెప్పిన ఓం రౌత్ తను చేసిన సినిమాలో ఎక్కడో పొరపాటు జరిగిందని, అలా తీయకుండా ఉండాల్సిందని మాత్రం ఒప్పుకోకపోగా వందల కోట్లు వచ్చాయని కుంటి సాకు చూపించడం కామెడీగా ఉంది. అందుకే అంటారు అందరికీ ఫ్లాపుని ఒప్పుకోవడం రాదని. ఆదిపురుష్ తర్వాత ఓంరౌత్ ఇప్పటివరకు తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేసింది లేదు.













