‘ఒక తెలుగు ప్రేమకథ’ ట్రైలర్ విడుదల
మహేంద్ర, లావణ్య జంటగా నటిస్తున్న చిత్రం ఒక తెలుగు ప్రేమకథ. బి.సంతోష్కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. డిజిక్విస్ట్ ఇండియా లిమిటెడ్ పతాకంపై కె.బసిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్ను హైదరాబాద్లో కె.ఎస్.రవికుమార్, సమ్మెట గాంధీ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ఆంగ్లభాషపై మోజుతో మాతృభాష తెలుగును మర్చిపోతున్నారు. తెలుగు భాష సంస్కృతి కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో భాష అభ్యున్నతి కోసం ఓ జంటగా సాగించిన ప్రయత్నమే ఈ చిత్ర ఇతివృత్తం. తెలుగు భాషను వారు ఎలా కాపాడుకున్నారన్నది ఆకట్టుకుంటుంది. మన సంస్కృతి, సంప్రదాయాల విలువల్ని తెలియజెపుతుంది. నేటి తరానికి ఉపయుక్తమయ్యే సినిమా ఇది. సందేశం, మానవీయ విలువలతో ఆకట్టుకుంటుంది అని తెలిపారు. తెలుగు భాషా గొప్పతనాన్ని చాటిచెప్పే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. మంచి సినిమాలో తాను భాగమవ్వడం ఆనందంగా ఉందని నిర్మాణ సారథి పి.ఎల్.కె.రెడ్డి పేర్కొన్నారు.













