OG: ఓజి కోసం పవన్ మరో మూడు రోజులు?

పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా సుజిత్(sujeeth) దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఓజి(OG). వీరమల్లు(Veeramallu) సినిమా అనుకున్న అంచనాలను అందుకోక పోవడంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాపైనే తమ ఆశలను పెట్టుకున్నారు. పవన్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టే ఓజి నుంచి వచ్చే ప్రతీ కంటెంట్ వారికి ఎంతో హై ఇస్తుంది. రీసెంట్ గా ఓజి ఫస్ట్ సింగిల్ రిలీజవగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
వినాయక చవితి సందర్భంగా రేపు రెండో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 25న ఓజి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ స్పీడును పెంచారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటున్న ఓజి ప్రమోషన్స్ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది.
ఓజి ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడని అంటున్నారు. వీరమల్లు లానే ఓజిని కూడా పవన్ ప్రమోట్ చేయనున్నాడని, రిలీజ్ కు ముందు ఓ మూడు రోజుల పాటూ సినిమాను స్పెషల్ గా ప్రమోట్ చేయడానికి పవన్ ప్లాన్ చేస్తున్నారట. తన రాజకీయ కార్యకలాపాలన్నింటినీ పక్కన పెట్టి మరీ ఈ మూవీ ప్రమోషన్స్ పై పవన్ దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. అదే జరిగితే ఓజి హైప్ కు ఆకాశమే హద్దు అవడం ఖాయం.