OG: ఓజి రన్ టైమ్ ఎంతంటే?

టాలీవుడ్ లో రీసెంట్ టైమ్స్ లో విపరీతమైన హైప్ తెచ్చుకున్న సినిమా అంటే ఎవరైనా ముందు చెప్పే సినిమా పేరు ఓజి(OG) అనే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ఓజి. సుజిత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై మొదటి నుంచి భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటూ సదరు సినీ ప్రియులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుండగా, రీసెంట్ గా మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్(OG Trailer) ను రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజయ్యాక ఈ సినిమాపై హైప్ ఇంకాస్త పెరిగింది. ఎప్పుడెప్పుడు ఓజి చూద్దామా అని అందరూ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఓజి మూవీకి సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ను జారీ చేయగా, అందులో యాక్షన్ సీన్స్, వయొలెన్స్ ఎక్కువగా ఉండటంతో మేకర్స్ సినిమాకు ఆ సర్టిఫికెట్ ను ఇచ్చారని, రన్ టైమ్ కూడా 2 గంటల 34 నిమిషాలుగా టాక్ వినిపిస్తోంది. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో పవన్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.