OG: ఓజి ఓటీటీ రిలీజ్ పై క్రేజీ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా వచ్చిన తాజా సినిమా ఓజి(OG). టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలుండగా, రిలీజ్ తర్వాత ఓజికి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఎంతో కాలంగా పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్ ఓజి రూపంలో పవన్ కు దొరికింది. అంతేకాదు, ఫ్యాన్స్ ఆకలిని కూడా ఓజి తీర్చేసింది.
థియేటర్లలో సాలిడ్ కలెక్షన్లతో అదరగొడుతున్న ఓజి సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్‌యంలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ అప్డేట్ వినిపిస్తుంది. ఓజి సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిందని తెలుస్తోంది. ఓజి సినిమా అక్టోబర్ 23 నుంచి ఓటీటీలోకి రానుందని సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి.
ఓజి మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ రేటుకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకోగా, అక్టోబర్ 23 నుంచి ఓజి స్ట్రీమింగ్ కు రానుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka arul Mohan) హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి తమన్(Thaman) సంగీతం అందించగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్(DVV entertainments) భారీ బడ్జెట్ తో ఓజిని నిర్మించింది.