OG: కూలీ థియేటర్లలో ఓజి సందడి

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూలీ(Coolie). ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న ఈ మూవీపై మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి. దానికి తోడు కూలీలో పలు భాషలకు చెందిన ప్రముఖులు నటిస్తుండటంతో సినిమాపై హైప్ భారీగా పెరిగింది. వాటన్నింటికీ అనిరుధ్(anirudh) సంగీతం కూడా తోడై అంచనాలు ఆకాశాన్నంటించాయి.
అయితే కూలీ సినిమాపై ఎలా హైప్ ఉందో పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా వస్తోన్న ఓజి సినిమా పై కూడా అంతే హైప్ ఉంది. సుజిత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఇప్పటికే యూఎస్ లో కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా బుకింగ్స్ నెక్ట్స్ లెవెల్ లో జరుగుతున్నాయి. అయితే కూలీ ప్రీమియర్స్ కు ఓజీ గ్లింప్స్ ను యాడ్ చేస్తున్నారట.
అసలే కూలీ సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ హై లో ఉంటారనుకుంటే ఇంటర్వెల్ లో ఓజి గ్లింప్స్(OG Glimpse) ను అటాచ్ చేసి ఆ టైమ్ లో కూడా వారికి మరింత హైప్ ను ఇవ్వనున్నారన్నమాట. దీంతో కూలీ థియేటర్లలో బ్లాస్ట్ మామూలుగా ఉండదని తెలుస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటిస్తున్న ఓజి సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.