ఆషికకు క్యూ కడుతున్న ఆఫర్లు
టాలీవుడ్ లోకి కన్నడ నుంచి ఏ హీరోయిన్ వచ్చినా ఆమె లక్కీ ఫేవర్ గా అవుతుంది. కొందరు ఫస్ట్ సినిమాతోనే లక్కీ ఛార్మ్ అవుతుంటే మరికొందరు సినిమాలు చేస్తున్న కొద్దీ ఆ లక్ ను అందుకుంటున్నారు. రష్మిక, కృతి శెట్టి అలా వచ్చి అదరగొడుతున్న వాళ్లే. ఇప్పుడు తాజాగా ఆషిక రంగనాథన్ కూడా ఆ లిస్ట్ లోకి జాయినైంది.
కళ్యాణ్ రామ్ తో కలిసి అమిగోస్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆషికా ఆ సినిమాతో అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. రీసెంట్ గా నాగార్జునకు జోడీగా నా సామిరంగ సినిమా చేసి ఆ మూవీతో సూపర్ హిట్ ను అకౌంట్ లో వేసుకుంది. నా సామిరంగ చూసినవారంతా అమ్మడి గురించి మాట్లాడుకునేలా చేసింది.
నా సామిరంగ తర్వాత ఆషికకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కానీ వచ్చిన ప్రతీ సినిమానూ ఓకే చేయకుండా అమ్మడు కథల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటుంది. తనకు కథ నచ్చి, కథలో తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాలను ఒప్పుకోవాలనుకుంటుందట ఆషిక. నా సామిరంగతో మంచి హిట్ అందుకున్న ఆషికకు మరో మంచి హిట్ పడితే తన క్రేజ్, స్థాయి మారడం ఖాయం.













