NTRNeel: ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ అప్డేట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) హీరోగా ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టగా, ఎన్టీఆర్ కూడా గత నెల 22 నుంచి సెట్స్ లో జాయినై షూటింగ్ లో పాల్గొంటున్నాడు. #ఎన్టీఆర్నీల్ (NTRNeel) వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ గురించి ప్రస్తుతం ఓ అప్డేట్ వినిపిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ గత కొన్నాళ్లుగా కర్ణాటకలో జరుగుతుండగా ఇప్పుడది పూర్తైనట్టు తెలుస్తోంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నాడట నీల్. ఎన్టీఆర్ తన పుట్టినరోజు వరకు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని తర్వాత మళ్లీ సెట్స్ లో జాయిన్ అవాలని చూస్తున్నాడట.మే 15న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా టైటిల్ తో పాటూ ఓ చిన్న గ్లింప్స్ ను కూడా రెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకు డ్రాగన్(Dragon) అనే టైటిల్ ను పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంతో స్లిమ్ గా, స్టైలిష్ గా తయారవగా, సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని అంటున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.






