NTRNeel: కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఎన్టీఆర్ నీల్
దేవర(Devara) సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల ముందే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా కోసం ఎన్టీఆర్ లేని సీన్స్ ను ముందుగా తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. రీసెంట్ గా వారం కిందట ఎన్టీఆర్ కూడా ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు.
వాస్తవానికి ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది కానీ ఇప్పుడు సంక్రాంతి నుంచి తప్పుకుని కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుని ఆ డేట్ ను మేకర్స్ అధికారికంగా పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు జూన్ 25, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లేటవడం వల్లే సినిమా వాయిదా పడినట్టు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఆల్రెడీ సంక్రాంతికి విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ డిసైడ్ చేసిన రిలీజ్ డేట్ అన్ని విధాలా బావుంటుందని వారు భావిస్తున్నారు. వచ్చే నెల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.






