NTRNeel: ఈ నెలాఖరు నుంచి డ్రాగన్ కొత్త షెడ్యూల్

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) చేతిలో ప్రస్తుతం పలు సినిమాలున్నాయి. రీసెంట్ గా వార్2(War2) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ మూవీతో ఫ్లాప్ ను మూట గట్టుకున్న తారక్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో డ్రాగన్(Dragon)(వర్కింగ్ టైటిల్) అనే యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అటు ప్రశాంత్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరికీ మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.
అలాంటి ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో డ్రాగన్ పై మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ జరుపుకున్న డ్రాగన్ మూవీ గురించి నిర్మాత(Ravi shankar) తాజాగా ఓ అప్డేట్ ఇచ్చాడు. డ్రాగన్ మూవీ కొత్త షెడ్యూల్ ఈ నెలాఖరు నుంచి మొదలవనుందని చెప్పాడు.
ఈ నెలాఖరు నుంచి మొదలై, నెక్ట్స్ సమ్మర్ వరకు డ్రాగన్ షూటింగ్ ఎలాంటి బ్రేకుల్లేకుండా నాన్ స్టాప్ గా జరగనుందని, మూవీ ఎక్స్‌ట్రాఆర్డినరీగా వస్తుందని ఆయన చెప్పాడు. డ్రాగన్ కోసం సమ్మర్ వరకు తారక్(Tarak) లాక్ అయితే, మరి త్రివిక్రమ్(Trivikram), కొరటాల(Koratala Siva)తో దేవర2(Devara2) ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తాడనేది తెలియాల్సి ఉంది. కాగా డ్రాగన్ మూవీ వచ్చే ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.