ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అత్యంత ఖరీదైన కారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ఖరీదైన కారు కొన్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. కొన్ని కోట్లు వెచ్చించి ఇటలీ నుంచి ప్రత్యేకంగా ఈ కారును తెప్పించుకుంటున్నారట ఎన్టీఆర్. కార్లంటే ఎవరికి మాత్రం మోజుండదు చెప్పండి. పైగా ఈ రోజుల్లో కారు అనేది ప్రెస్టేజీకి సింబల్‌గా కావడమే గాక ప్రతి కుటుంబానికి ఎంతో అవసరమైన వస్తువుగా మారింది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలయితే మార్కెట్లో వచ్చిన కొత్త కార్స్ వెంటనే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్ను ఓ ఖరీదైన కారుపై పడిందని, దీంతో కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన ఆ కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను బట్టి కార్లు మార్చే అలవాటున్న ఎన్టీఆర్.. మార్కెట్ లోకి కొత్త బ్రాండెడ్ కారు వచ్చిందంటే చాలు దాని గురించి ఆరా దీస్తుంటారట. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా ‘లంబోర్ఘిని’ లగ్జురియాస్ కార్ స్పోర్ట్స్ యుటిలిటీ ఎస్యూవీ వెహికల్ కొనేశారట ఎన్టీఆర్. ఈ కారు ఖరీదు 5 కోట్లు అని సమాచారం. ఇంకో విశేషం ఏంటంటే ఈ కారును ఇటలీ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారట ఎన్టీఆర్.
ప్రస్తుతం ఎన్టీఆర్ బుక్ చేసుకున్న కారుపై ఫిలిం నగర్ జనాలు తెగ చర్చించుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. వరుస విజయాలతో సత్తా చాటుతున్న ఈ యంగ్ టైగర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీలో కొమురం భీం రోల్ పోషిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ 25 కోట్లకు పైగా రెమ్మ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇక ఈ మూవీ పూర్తికాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్, కొరటాల శివ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయనున్నారు ఎన్టీఆర్.













