NTR: వార్2 మేకర్స్‌పై ఒత్తిడి తెస్తున్న తారక్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) కలయికలో అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో వార్2(War2) అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వార్2 షూటింగ్ చాలా వరకు పూర్తైంది. దుబాయ్, మలేషియాలో రెండు, మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేశారు. తాజాగా మరో షెడ్యూల్ కూడా పూర్తైంది.
అయితే వార్2 సినిమాను ఎట్టి పరిస్థితుల్లో జనవరి నాటికి పూర్తి చేయాలని మేకర్స్ ను ఎన్టీఆర్ కోరుతున్నాడట. ఈ లోపు సీన్స్ తో పాటూ సాంగ్స్ షూటింగ్ కూడా పూర్తి చేసి వార్2 నుంచి రిలీవ్ అవాలని చూస్తున్నాడట తారక్. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రశాంత్ నీల్(Prasanth Neel) సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని తారక్ ప్లాన్ చేస్తున్నాడట.
ఇందులో భాగంగానే తారక్ వార్2 మేకర్స్ ను తొందరపెడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నీల్ సినిమా జనవరి నుంచే సెట్స్ పైకి వెళ్లాలి కానీ తారక్ డేట్స్ అడ్జస్ట్ అవకపోవడంతో అది ఫిబ్రవరికి మారింది. అందుకే తారక్ కూడా ఈలోపు వార్2ను ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ఒకేసారి రెండు యాక్షన్ సినిమాలు చేయడం ఏ హీరోకీ కుదరని పని. అందుకే వార్2ని త్వరగా పూర్తి చేసి నీల్ సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడు తారక్(Tarak).













