NTR31: జానర్ ఏంటో చెప్పిన నీల్
దేవర(Devara) సక్సెస్ ను ఎంజాయ్ చేసి ప్రస్తుతం వార్2(War2) సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న ఎన్టీఆర్(NTR) తర్వాత ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో కలిసి నటించనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్, నీల్ సెట్స్ లో జాయిన్ కానున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఏ జానర్ అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. సలార్1(salaar1) ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నీల్ ఇచ్చిన స్పెషల్ ఇంటర్య్వూలో ఎన్టీఆర్ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది. అయితే ఈ సినిమా తాను గతంలో చేయాలనుకున్న మైథలాజికల్ కథ కాదని, పీరియాడిక్ సెటప్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు.
అంటే సలార్(Salaar) తరహాలో ఒక పెద్ద వరల్డ్ బిల్డింగ్ యాక్షన్ డ్రామాని చూడొచ్చన్న మాట. ఇంతకన్నా విశేషాలు పంచుకోలేదు కానీ ఇది చెప్తున్నప్పుడు నీల్ కాన్ఫిడెన్స్ బాగా కనిపించింది. క్యాస్టింగ్ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు కానీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్ గా లాక్ అవడం దాదాపు ఖాయమనే అంటున్నారు. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే నీల్ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి రికార్డులు సృష్టించడం ఖాయమే.













