NTR: మ్యాడ్ స్వ్కేర్ సక్సెస్ మీట్ కు ఎన్టీఆర్?
నార్నే నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Sobhan), రామ్ నితిన్(ram Nithin) హీరోలుగా వచ్చిన లేటెస్ట్ మూవీ మ్యాడ్ స్వ్కేర్(Mad Square). మ్యాడ్(MAD) కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వంలో సితార బ్యానర్(Sithara Entertainments) లో సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi) ఈ సినిమాను సమర్పించగా సాయి సౌజన్య(sai Sowjanya), సూర్యదేవర హారిక(Suryadevara Harika) మ్యాడ్ స్వ్కేర్ ను నిర్మించారు. మార్చి 28న రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
రిలీజైన నాలుగు రోజులకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయి, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు లాభాలను అందింస్తోంది. ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మూవీ యూనిట్ మ్యాడ్ స్వ్కేర్ కు సక్సెస్ మీట్ ను నిర్విహించాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాదు ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కు మరింత మ్యాడ్‌నెస్ యాడ్ చేయడానికి చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్(NTR) ను కూడా తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
ఏప్రిల్ 4న ఈ ఈవెంట్ ను శిల్ప కళా వేదికలో నిర్వహించి, ఎన్టీఆర్ ను తీసుకొచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని చూస్తున్నరట. ఎన్టీఆర్ కూడా ఈ సక్సెస్ ఈవెంట్ కు రావడం ఆల్మోస్ట్ ఖరారే అంటున్నారు. దానికి కారణం మ్యాడ్ లో నటించిన నార్నే నితిన్ ఎన్టీఆర్ కు స్వయానా బావమరిది అవడం. దానికి తోడు నిర్మాత నాగవంశీతో కూడా ఎన్టీఆర్ కు మంచి అనుబంధం ఉంది. ఇక మ్యాడ్ స్వ్కేర్ విషయానికొస్తే త్వరలోనే ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్ ను అందుకోవడం ఖాయం.







