NTR: దేవర2పై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొరటాల శివ(Koratala Siva), ఎన్టీఆర్(NTR) కాంబినేషన్ లో గతేడాది వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమా దేవర1(Devara1). బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి రికార్డులు సృష్టించిన ఈ సినిమా రీసెంట్ గా జపాన్ లో రిలీజైంది. ఈ సందర్భంగా దేవర సినిమాను జపాన్ లో ప్రమోట్ చేయడానికి వెళ్లారు డైరెక్టర్ కొరటాల శివ మరియు ఎన్టీఆర్. దేవర ప్రీమయర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల అక్కడి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అక్కడి మీడియా వారిని దేవర2(Devara2) గురించి అడిగింది. దానికి ఎన్టీఆర్ చెప్పిన సమాధానం దేవర2పై ఆసక్తిని పెంచుతుంది. దేవర కథ చాలా పెద్దదని, అందులో దేవర1 ఒక పార్ట్ మాత్రమేనని, సెకండ్ పార్ట్ ఎంతో అద్భుతంగా ఉండబోతుందని చెప్పిన ఎన్టీఆర్ దేవర1లో దేవర గురించి తెలుసుకున్నారు. సెకండ్ పార్ట్ లో దేవరకు ఏం జరిగింది? అనేది తెలుసుకోవడంతో పాటూ వర గురించి తెలుసుకుంటారన్నాడు.
దేవర2 కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తైందని, 2026 ఫస్టాఫ్ లో దేవర2 మొదలుకానుందని ఎన్టీఆర్ చెప్పాడు. అంటే ఈ లోపు ఎన్టీఆర్ తనకున్న కమిట్‌మెంట్స్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంది. జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) తో పాటూ బాబీ డియోల్ (Bobby Deol)కూడా విలన్ పాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కూడా అనిరుధే(Anirudh Ravichander) సంగీతం అందించనున్నాడు.







