బాలీవుడ్ డైరెక్టర్ ఎన్టీఆర్ ను ఏం చేస్తాడో?
ఒకప్పుడు బాలీవుడ్లోని యాక్షన్ సినిమాలను జనాలు తెగ ఆదరించారు. కానీ ఇప్పుడు సౌత్ లో వాటికి మించిన యాక్షన్ సినిమాలు రావడంతో వాళ్ల సినిమాలకు ఆదరణ తగ్గింది. టాలీవుడ్ లో ఫారిన్ బ్యాక్డ్రాప్ లో కాకుండా విలేజ్ బ్యాక్గ్రౌండ్, వింటేజ్ బ్యాక్ డ్రాప్ అంటూ మంచి యాక్షన్ డోస్ ఇస్తుండటంతో మన సినిమాలకు మంచి క్రేజ్ వస్తుంది.
దీంతో నార్త్ ఆడియన్స్ కు బాలీవుడ్ సినిమాలపై క్రమంగా క్రేజ్ తగ్గిపోయి, సౌత్ సినిమాలపై ప్రేమను పెంచుకుంటున్నారు. ఇప్పుడు టైగర్3 ఎఫెక్ట్ కు రాబోయే వార్2 సినిమాపై టెన్షన్ మొదలైంది. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన టైగర్ మొదటి, రెండవ భాగాలు బాగున్నాయి కానీ టైగర్3లో మాత్రం కొత్త తరహా కంటెంట్ లేకపోవడంతో నెగిటివ్ టాక్ వస్తోంది.
దీంతో వార్2 సినిమా ఎలా ఉంటుందో అని ఊహాగానాలు మొదలయ్యాయి. అసలే ఈ సినిమాతో జూ.ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇస్తున్నాడు. దానికి తోడు నెగిటివ్ రోల్ అంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ను నమ్మి ప్రభాస్ ఎంత నష్టపోయాడో ఆదిపురుష్ రిజల్ట్ తో చూశాం. మరో బాలీవుడ్ డైరెక్టర్ అయిన అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ కు ఎలాంటి ఫలితాన్నిస్తాడో చూడాలి.













