War2: వార్2లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్?
ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్2(War2) షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తైపోయింది. వచ్చే ఏడాది ఆగస్ట్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం తారక్ ఎంతగానో కష్టపడ్డాడని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్- హృతిక్ కాంబినేషన్ లో వచ్చే సాంగ్, ఫైట్స్ ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయని టీమ్ తెగ ఊరిస్తోంది.
యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట ప్రచారమవుతుంది. ఆ ప్రచారం ప్రకారం ఎన్టీఆర్ వార్2 లో రెండు షేడ్స్ లో కనిపిస్తాడట. అందులో ఒకటి దేశ భక్తితో శత్రువు ఎంతటోడైనా సరే ఊచకోత కోసే ఇండియన్ ఆఫీసర్ కాగా మరొకటి పైకి చెడుగా అనిపించినా లోపల ఎమోషన్ ఉండే విలన్ టైప్ రోల్ అని తెలుస్తోంది.
మరి ఇది ద్విపాత్రాభినయమా లేక సందర్భానుసారంగా ఆ పాత్ర అలా ప్రవర్తిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మార్చి నుంచి ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్న వార్2 సినిమా కోసం దేశమంతా ఎంతగానో ఎదురుచూస్తుంది. దేవర(Devara) తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ ఏర్పడుతుంది. నాగవంశీ(Naga Vamsi) డిస్ట్రిబ్యూషన్ కోసం తెగ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.













