సలార్ లో యష్, తారక్?
ఎంత లేట్ అయినా, ఎన్ని సార్లు పోస్ట్ పోన్ అయినా సలార్ మీద హైప్, క్రేజ్ మాత్రం తగ్గకపోగా, రోజురోజుకీ పెరిగిపోతుంది. మరో రెండున్నర నెలల్లో రిలీజ్ కాబోతున్న సలార్ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటూ సాధారణ ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుందని తెలిసి ఫ్యాన్స్ ఆ రోజు కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
ఇకపై సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో నిశ్చింతగా ఉన్నారు ఫ్యాన్స్. అయితే తాజా సమాచారం ప్రకారం సలార్ క్లైమాక్స్ తర్వాత వచ్చే పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో యష్, జూ. ఎన్టీఆర్ ల చిన్న సర్ప్రైజ్ క్యామియోలు ఉంటాయని, వాటిని ఎవరూ ఊహించని రీతిలో ప్రశాంత్ నీల్ డిజైన్ చేశాడని సమాచారం.
నార్మల్ గా ఇలాంటి టెక్నిక్స్ ను హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఇప్పుడు సలార్ కు కూడా ప్రశాంత్ నీల్ ఆ టెక్నిక్ నే అప్లై చేయబోతున్నాడట. ఈ వార్తలను అబద్దమని కొట్టిపారేయడానికి లేదు. యష్ కు లైఫ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ అడిగితే కాదనదేని ఉండదు. జూ.ఎన్టీఆర్ తో ఎలాగూ ప్రశాంత్ నీల్ మూవీ ఉంది కాబట్టి ఆ చనువుతో ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పొచ్చు. ఈ వార్త మాత్రం నిజమైతే ఫ్యాన్స్ థియేటర్లలో నుంచి బయటకు రావడం కష్టమనే చెప్పాలి.













