NTR: బామ్మర్దికి బావ సలహా
నార్నే నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Sobhan), రామ్ నితిన్(ram nithin) హీరోలుగా వచ్చిన మ్యాడ్ స్వ్కేర్(mad square) మార్చి 28న ప్రేక్షకుల ముందుకొచ్చి థియేటర్ల దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ అయిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది మ్యాడ్ స్వ్కేర్. ఆల్రెడీ రూ.75 కోట్లు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన మ్యాడ్ స్వ్కేర్ ఈ వీకెండ్ లోపే రూ.100 కోట్ల మార్క్ ను దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మ్యాడ్ స్వ్కేర్ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్ర యూనిట్ ఇవాళ ఇవాళ సక్సెస్ మీట్ ను శిల్ప కళా వేదికలో నిర్వహించనుది. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్(NTR) చీఫ్ గెస్టుగా హాజరు కానున్నాడు. ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు రావడానికి కారణం తన బావ మరిది నార్నే నితిన్ తో పాటూ నాగవంశీ(Naga vamsi)తో ఉన్న బాండింగ్. దాంతో పాటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందుకొచ్చి చాలా రోజులవుంది.
ఇదిలా ఉంటే నితిన్ ఆల్రెడీ మ్యాడ్(Mad), ఆయ్(Aay), మ్యాడ్ స్వ్కేర్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ హిట్స్ ను కాపాడుకోవడానికి తర్వాతి సినిమాల విషయంలో బావమరిదిని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడట ఎన్టీఆర్. ఇక మీదట కూడా ప్రేమ కథలపైనే దృష్టి పెట్టి లవ్ ఎంటర్టైనర్లు చేయమని నితిన్ కు ఎన్టీఆర్ సలహా ఇచ్చాడట. నితిన్ కూడా బావ ఇచ్చిన సలహానే పాటిస్తూ తర్వాతి సినిమాగా ఒక లవ్ స్టోరీకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వీలుంది.













