Nora Fatehi: ప్యారిస్ లో నోరా స్టన్నింగ్ లుక్స్

బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన నోరా ఫతేహి(Nora Fatehi), స్పెషల్ సాంగ్స్ తో యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేసింది. నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా నోరా పలు సినిమాల్లో నటించింది. ఫ్యాషన్ రంగంలో బాగా అప్డేటెడ్ గా ఉండే నోరా ఫతేహి ఇప్పుడు పారిస్ ఫ్యాషన్ వీక్ కోసం ఫ్రాన్స్ కు వెళ్లి, అక్కడ తన అందాలతో అందరినీ స్టన్ అయ్యేలా చేస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలను నోరా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమ్మడు వైట్ అంట్ వైట్ హాఫ్ షోల్డర్ ట్రెంచ్ కోట్ ధరించి బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని నెటిజన్ల మతులు పోగొడుతుంది. నోరా షేర్ చేసిన ఈ ఫోటోలకు ఆమె ఫాలోవర్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.