Viswambhara: ఇప్పటికైనా నోరు విప్పితే బెటర్

ఈ మధ్య టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఏ సినిమాలూ చెప్పిన టైమ్ కు రాలేకపోతున్నాయి. కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ దొరక్క పోస్ట్ పోన్ అవుతుంటే మరికొన్ని షూటింగ్ వల్ల, ఇంకొన్ని హీరో డేట్స్ అడ్జస్ట్ అవక ఇలా కారణాలేవైనా సరే సినిమాలు మాత్రం చెప్పిన డేట్స్ కు రాలేకపోతున్నాయి. ఫలితంగా ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.
అయితే టాలీవుడ్ లో ఇప్పటికే రావాల్సిన పెద్ద సినిమాల్లో చిరంజీవి(Chiranjeevi) విశ్వంభర(Viswambhara)తో పాటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ది రాజా సాబ్(The Raja Saab) ఉన్నాయి. ఎప్పుడో రిలీజవాల్సిన ఈ రెండు సినిమాలు ఇప్పటికీ రిలీజవలేదు. దీంతో ఈ సినిమాలు ఎప్పుడు రిలీజవుతాయా అని ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. విశ్వంభర నుంచి కనీసం ఓ పాటైనా వచ్చింది.
కానీ రాజాసాబ్ నుంచి అది కూడా లేదు. పోనీ షూటింగ్ అప్డేట్ అయినా ఏమైనా ఉందా అంటే ఏమీ చెప్పడం లేదు. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడటం వల్ల సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ తగ్గడమే కాకుండా బిజినెస్ కూడా డల్ అయ్యే ఛాన్సుంది. ఇప్పటికైనా మేకర్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఆయా సినిమాల రిలీజ్ డేట్స్ పై అప్డేట్ ఇస్తే బావుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.