హిట్ ఇచ్చిన డైరక్టర్ పైనే బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..
కొన్ని కాంబినేషన్స్ కి ఉండే క్రేజే వేరు. టాలీవుడ్ లో ఇప్పుడు మళ్లీ అలాంటి కాంబినేషన్స్ అన్నీ రిపీట్ అవుతున్నాయి. వేరే డైరక్టర్స్ ని నమ్ముకుని చేతులు కాల్చుకునే కంటే తమకు నమ్మకమైన వాళ్లు, హిట్ ఇచ్చే దర్శకులతో కొంచెం లేట్ అయినా సరే హిట్ ఇస్తే చాలనుకుంటున్నారు హీరోలు. ప్రస్తుతం అలాంటి ఒక కాంబినేషన్ రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న బీబీ3 సినిమా కోసం వీరిద్దరూ కలిసి మూడోసారి పని చేస్తున్నారు.
గతంలో వీరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ లు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి వీరిద్దరూ రెడీ అవడంతో సినిమా మీద అంచనాలు ఒక రేంజిలో పెరిగిపోయాయి. బాలయ్యను ఇప్పటి వరకు చాలా మంది డైరక్టర్లు పవర్ ఫుల్ గా చూపించారు కానీ అందరిలో బోయపాటి బాలయ్యను ప్రెజెంట్ చేసిన విధానం చాలా డిఫరెంట్. బాలయ్యతో ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా తీయాలి అంటే అది కేవలం బోయపాటికి మాత్రమే సాధ్యమనేలా వారి కాంబో వర్కవుటయింది.
ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమాను మే 28న రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం విదితమే. కానీ ఇంతవరకు సినిమా టైటిల్ ను కూడా అనౌన్స్ చేయకపోవడం ఫ్యాన్స్ కు జీర్ణించుకోలేని అంశంగా మారింది. కరోనా ప్రభావం ఎక్కువవుతున్న కారణంగా ప్రతీ సినిమా యూనిట్ ఏదొక అప్డేట్స్ ఇస్తుంటే వీళ్లు మాత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం తప్పించి ఆ తర్వాత మరో అప్డేట్ సినిమా గురించి వదిలింది లేదు. అసలు సినిమా ఎంతవరకు షూటింగ్ పూర్తి చేసుకుంది? ఇంకెంత షూటింగ్ మిగిలుంది? అసలు చెప్పిన టైమ్ కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తారా లేదా ఇంతే అప్డేట్స్ లేకుండా చేస్తారా అని ఫ్యాన్స్ బోయపాటి పై గుర్రున ఉన్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మిర్యాల రవీందర్ నిర్మిస్తున్నారు.













