బ్రహ్మాస్త్ర సీక్వెల్ సంగతేంటి?
రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఫాంటసీ యాక్షన్ మూవీ బ్రహ్మాస్త్ర. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ శివ 2022 సెప్టెంబర్ లో రిలీజైంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీతో పాటూ తెలుగులో కూడా రిలీజై మంచి ప్రేక్షకాదరణ పొందింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున స్పెషల్ రోల్ లో నటించిన ఈ సినిమా తెలుగులో మంచి హిట్ గా నిలిచింది.
ఈ సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. ఈ సినిమా రిలీజ్ టైమ్ లోనే దీనికి సీక్వెల్ ఉంటుందని, మరో రెండేళ్లలో పార్ట్ 2 వస్తుందని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. కానీ ప్రస్తుతానికి ఈ సీక్వెల్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ వేరు వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో వారి వారి కమిట్మెంట్స్ పూర్తయ్యాక బ్రహ్మాస్త్ర-2ని ప్లాన్ చేయాలనుకున్నారట.
రీసెంట్ గా రిలీజైన హను మాన్ సినిమాలో ఏ రేంజ్ గ్రాఫిక్స్ ఉన్నాయో బ్రహ్మాస్త్ర2లో కూడా అదే రేంజ్ లో గ్రాఫిక్స్ ఉంటాయని సమాచారం. పార్ట్ 1 కంటే బ్రహ్మాస్త్ర2 మరింత భారీగా ఉండబోతుందట. రణ్ బీర్ కపూర్ ఈ సినిమాకు డేట్స్ ఇవ్వాలంటే 2025 వరకు ఆగాల్సిందే అనిపిస్తుంది. ఈ లోపు అయాన్ కూడా వార్2 సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు.













