ఆ సినిమాలో చరణ్ లేడట
విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లియో. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రానుంది. ఇదిలా ఉంటే లియో సినిమాలో ఓ సర్ప్రైజ్ క్యామియో ఉంటుందని లోకేష్ చెప్పిన దగ్గర నుంచి ఆ క్యామియో ఎవరు చేశారా అని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఆ గెస్ట్ మరెవరో కాదు తమ అభిమాన హీరో రామ్ చరణే అని చెర్రీ ఫ్యాన్స్ తెగ ఎగ్జయిట్ అయిపోతున్నారు. విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారెక్టర్ లాగా ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ కూడా కనిపించేది కాసేపే అయినా చాలా ఇంపాక్ట్ ఉంటుందని ఫ్యాన్స్ తెగ ఊహించేసుకుంటున్నారు. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం లియోలో చరణ్ క్యామియో లేదని తెలుస్తుంది.
వేరే స్టార్ లియోలో సర్ప్రైజ్ ఇవ్వబోతున్న మాట నిజమే కానీ అది రామ్ చరణ్ మాత్రం కాదని చాలా గట్టిగా చెప్తున్నారు. కాబట్టి మెగా ఫ్యాన్స్ ఈ విషయంలో ఎక్కువ ఊహించుకోకుండా ఉంటే బెటర్. మళ్లీ సినిమా చూశాక ఫీలవడం కంటే ముందు నుంచే లేడని ఫిక్స్ అయితే సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. మరి లోకేష్ చెప్తున్న ఈ గెస్ట్ రోల్ ఎవరు చేశారో తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.













