విక్రమార్కుడు2 లేనట్టేనా?
విక్రమార్కుడు సినిమాకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ మహారాజా రవితేజ, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇద్దరికీ మంచి విజయాన్నిచ్చింది. అంతేకాదు, ఆ తర్వాత విక్రమార్కుడు సినిమా ఎన్నో భాషల్లో రీమేక్ కూడా అయింది. ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని ఎంతో కాలంగా ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
విక్రమ్ రాథోడ్ ని చంపిన వాళ్ల అంతు చూసిన అత్తిలి సత్తిబాబు హైదరాబాద్కు వచ్చాక నిజంగా పోలీస్ అయితే ఎలా ఉంటుందనే కోణంగా కథ రాసుకుని సినిమా చేసే స్కోప్ ఉంది. ఈ విషయంలో రవితేజ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాడు. కానీ ఈ సీక్వెల్ పట్టాలెక్కే ఛాన్స్ లు ఏ మాత్రం కనిపించట్లేదు. దానిక్కారణం రాజమౌళి రేంజ్ ఇప్పుడు బాగా పెరిగిపోవడమే.
విక్రమార్కుడు టైమ్ లో రాజమౌళి క్రేజ్ టాలీవుడ్ కే పరిమితమైంది కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం రాజమౌళి అంటే ఎవరో తెలుసు. అలాంటి క్రేజ్ వచ్చాక విక్రమార్కుడు లాంటి రెగ్యులర్ స్టోరీలతో సినిమాలు చేయడం కష్టమే. చేస్తే మరో డైరెక్టర్ తో ఆ సీక్వెల్ చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి ధైర్యం చేయడానికి ఎవరూ ముందుకు రారు. కాబట్టి విక్రమార్కుడు2 లేనట్టే అని ఫిక్స్ అయిపోవడం బెటర్.













