నాలుగేళ్లైనా వీరమల్లు విషయంలో నో ప్రోగ్రెస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రానున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అయినప్పటికీ వీరమల్లు ఎప్పుడు రిలీజవుతుందో చెప్పలేని పరిస్థితిలో చిత్ర యూనిట్ ఉంది. మొదట్లో ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు ఫ్యాన్స్ కు కలిగిన ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు.
కానీ ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువ కాలం నిలవకముందే కరోనా రూపంలో సినిమాకు బ్రేక్ పడింది. ఆ తర్వాత పవన్ వేరే సినిమాలు చేయడం, ఈ సినిమాను పక్కకు పెట్టడం లాంటివి జరిగాయి. ఎలా చూసినా ఈ సినిమా 2024లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఏప్రిల్ లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ తర్వాత ఓజీకి ముందుగా డేట్స్ ఇవ్వడానికి పవన్ డిసైడైనట్లు తెలుస్తోంది.
ఓజీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చేసి ఆ తర్వాత వీరమల్లు కు డేట్స్ అడ్జస్ట్ చేయనున్నాడు. అందుకే ఈ లోపు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను చేయాలని క్రిష్ కథను రెడీ చేసుకుని దానిపై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే వీరమల్లు ఎంత లేదన్నా 2026లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే సినిమా మొదలుపెట్టిన తర్వాత ఆరేళ్లకు థియేటర్లలోకి రానుందన్నమాట. కానీ నిర్మాత ఏఎం రత్నం మాత్రం ఎలక్షన్స్ అవగానే సినిమాను తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్తామని చెప్పుకొస్తున్నాడు. పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఏఎం రత్నం మాటలు ఏ మాత్రం వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.













